ప్రజా భవన్ లో కేసీఆర్ పేరును మట్టితో కప్పేశారు..

Published : Dec 08, 2023, 01:04 PM IST
ప్రజా భవన్ లో కేసీఆర్ పేరును మట్టితో కప్పేశారు..

సారాంశం

ప్రగతి భవన్ ప్రారంభించిన నాటి శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరును ఎవరో మట్టితో పూసి, కనిపించకుండా చేశారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయం ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రగతిభవన్ ను జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్ గా మార్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రగతిభవన్ మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఇన్నాళ్లు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది. ప్రగతి భవన్ లోకి ఎంట్రీ నిషిద్ధం. సామాన్యులకైతే చెప్పాల్సిన పనిలేదు. ముళ్లకంచెలు, బారికేడ్లు, పోలీసు బందోబస్తు.. అటువైపు చూడడానికి కూడా భయపడే పరిస్థితి. అయితే, ఇప్పుడు ఇది మారింది. 

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతిభవన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజూ ప్రగతిభవన్ పేరును జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్ గా మారుస్తూ.. ప్రమాణ స్వీకార వేదికమీదినుంచే ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తరువాత వెంటనే ప్రజాదర్బార్ ముందున్న కంచెలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆగమేఘాల మీద కంచెల తొలగింపు జరుగుతోంది.

ఇంద్రవెల్లికి, ప్రొఫెసర్ జయశంకర్ కు కొత్త ప్రభుత్వం ఘననివాళి...

ఇకపై ప్రజాభవన్ కు ఎవరైనా రావచ్చు. ఎలాంటి ఆంక్షలు, అడ్డంకులు ఉండవని రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారంనాడు జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. దీనికి పెద్ద సంఖ్యలో జనం వచ్చి తమ వినతులు చెప్పుకోవచ్చని, ముఖ్యమంత్రిని నేరుగా కలుసుకోవచ్చని తెలిపారు. చెప్పినట్టే శుక్రవారం ఉదయం ప్రజాదర్భార్ లో తనను కలవడానికి వచ్చిన వారి వినతులు స్వీకరించారు. సామాన్యులు ప్రగతి భవన్ లో ప్రవేశించి.. ఆసక్తిగా తిలకించారు. 

ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన ఫొటో వెలుగు చూసింది. ప్రగతి భవన్ ప్రారంభించిన నాటి శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరును ఎవరో మట్టితో పూసేశారు. కనిపించకుండా చేశారు. ఆవిష్కరించినవారు అని కేసీఆర్ పేరు ఉన్నచోట ఇలా మట్టితో కప్పేసి కనిపించింది. దీన్ని ఓ వ్యక్తి ఆసక్తిగా గమనిస్తున్న ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారుతుంది. అయితే, ఇది ఎవరైనా ఆకతాయి పనా.. కావాలనే చేసిందా అనేది తెలియదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది