కొడంగల్ వద్ద రెండు కార్లు ఢీ, నుజ్జు నుజ్జు: అక్కడికక్కడే నలుగురు మృతి

Published : Jun 19, 2021, 10:18 AM ISTUpdated : Jun 19, 2021, 10:49 AM IST
కొడంగల్ వద్ద రెండు కార్లు ఢీ, నుజ్జు నుజ్జు: అక్కడికక్కడే నలుగురు మృతి

సారాంశం

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు కార్లు పరస్పరం ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.

వికారాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉంది. 

వికారాబాద్ జిల్లా కొడంగల్ శివారంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు పరస్పరం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. హైదరాబాదు నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతేదేహాలను వెలికి తీశారు.ఇన్నోవా కారులోని నలుగురు మృతి చెందారు. వారిని హైదరాబాదులోని యూసుఫ్ గుడాకు చెందిన అబ్దుల్, రషీద్, అమీర్, మలాన్ బేగంలుగా గుర్తించారు. 

వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Holiday : ఈసారి లాంగ్ వీకెండ్.. వరుసగా మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?