ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక శవం: హత్య చేసి నిప్పు పెట్టారని అనుమానం

Published : Jun 19, 2021, 09:58 AM ISTUpdated : Jun 19, 2021, 10:03 AM IST
ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక శవం: హత్య చేసి నిప్పు పెట్టారని అనుమానం

సారాంశం

ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద ఓ బాలిక శవం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. పదో తరగతి పూర్తి చేసిన ఆ బాలికను ఆగంతకులు హత్య చేసి, పెట్రోల్ పోసి శవానికి నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు.

మేడ్చెల్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలో ఓ బాలిక శవం అనుమానాస్పద స్థితిలో కనపించింది. ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వద్ద బాలిక శవం కనిపించింది. హత్య చేసి బాలిక శవంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారని అనుమానిస్తున్నారు. 

మేడ్చెల్ సమీపంలో కనిపించిన ఆ బాలికను స్రవంతిగా గుర్తించారు. శుక్రవారం అర్థరాత్రి బాలిక ఇంటి నుంచి వెళ్లినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆమె పదో తరగతి పూర్తి చేసింది. ఘటనా స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. తల్లిదండ్రులతో గొడవ పడి బాలిక ఇంట్లోంచి బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?