తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ ఉద్యోగుల దుర్మరణం

sivanagaprasad kodati |  
Published : Dec 17, 2018, 01:45 PM IST
తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ ఉద్యోగుల దుర్మరణం

సారాంశం

సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న భాస్కర్‌రావు, హరికృష్ణలు ఏపీ సచివాయంలలో విధులు నిర్వర్తిస్తున్నారు.

శని, ఆదివారాలు సెలవులు కావడంతో వారు కుటుంబంతో గడిపి అనంతరం సోమవారం విధులకు హాజరయ్యేందుకు కారులో అమరావతికి బయలుదేరారు. తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కోదాడ మండలం దొరకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు నుంచి దాదాపు 50 మీటర్లు వెళ్లి పల్టీలు కొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురిని పోలీసులు కోదాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో విజయలక్ష్మీ అనే ఉద్యోగి పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌