బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్: హరీష్ రావు హాజరు

Published : Dec 17, 2018, 12:04 PM ISTUpdated : Dec 17, 2018, 12:08 PM IST
బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్: హరీష్ రావు హాజరు

సారాంశం

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కల్వకుంట్ల తారక రామారావు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో ఆయన, ముందుగా నిర్ధారించిన ముహూర్తం ప్రకారం 11.56 గంటల కార్యానిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 

అంతకు ముందు ఆయన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. సోదరి, నిజామాబాద్ ఎంపీ కవిత కేటీఆర్‌కు వీరతిలకం దిద్దారు. అనంతరం ఇంటి నుంచి తెలంగాణ భవన్ వరకు 20 వేల మంది కార్యకర్తలతో కేటీఆర్ భారీ ర్యాలీగా తరలివచ్చారు.

అనంతరం టీఆర్ఎస్ భవన్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలకనేతలు కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హరీశ్ రావు‌ ఆయనకు అభినందనలు తెలియజేశారు. కేటీఆర్ ఈ నెల 20 నుంచి జిల్లా పర్యటనలు చేపట్టనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu