తెలంగాణ: టీచర్ల బదిలీ, ప్రమోషన్లలో ట్విస్ట్.. మెలిక పెట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

By Siva KodatiFirst Published Jul 29, 2021, 7:02 PM IST
Highlights

పదోన్నతులు ఇచ్చిన తర్వాత రావాల్సిన ప్రమోషన్స్ ఇవ్వకపోతే కోర్టుకెళతామని తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం తెలిపింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ అసాధ్యమని టీచర్లు వాదిస్తున్నారు. 

తెలంగాణలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్త జిల్లాల వారీగా బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో టీచర్ల ఏకీకృత సర్వీస్‌పై హైకోర్టు స్టే విధించింది. కోర్టులో కేసు వుండగా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వ టీచర్ల సంఘం అంటోంది. యాజమాన్యాల వారీగా ప్రమోషన్స్, బదిలీలు హెచ్ఎం పోస్టులకే అంటే ఒప్పుకునేది లేదని వారు తేల్చి చెప్పారు. అన్ని క్యాడర్లలో ప్రమోషన్స్ ఇస్తామంటేనే ఒప్పుకుంటామని వారు తెలిపారు. పదోన్నతులు ఇచ్చిన తర్వాత రావాల్సిన ప్రమోషన్స్ ఇవ్వకపోతే కోర్టుకెళతామని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం తెలిపింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ అసాధ్యమని టీచర్లు వాదిస్తున్నారు. 
 

click me!