భార్యను చెల్లి అని పిలవమన్నాడని కసితో పెట్రోల్ పోసి హత్య.. తండ్రి, కొడుకు, గర్భస్థ శిశువు మృతి...

By SumaBala Bukka  |  First Published Nov 16, 2022, 10:38 AM IST

భార్య ఆమె ప్రియుడు, కొడుకు మీద పెట్రోల్ పోసిన కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యను చెల్లి అని పిలవాలని ప్రియుడు అనడంతోనే హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. 


హైదరాబాద్ : తన భార్యను రెండో పెళ్లి చేసుకున్నదే కాకుండా.. ఆమెను చెల్లి అని పిలవాలంటూ రెండో భర్త నాగరాజు.. మొదటి భర్త  నాగుల సాయిని బెదిరించాడు. దీంతో కోపం పెంచుకున్న అతను వారి కుటుంబం మొత్తం మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గతవారంలో కలకలం రేపిన నారాయణగూడ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘటనలో ముగ్గురు మరణించగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. 

వివరాల్లోకి వెడితే.. నారాయణగూడ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద నాగుల స్థాయిని అడ్డగించిన నాగరాజు తన భార్య ఆర్తీతో మాట్లాడినా, ఫోన్ చేసినా ఊరుకునేది లేదని అతడిని హెచ్చరించాడు. ఇకపై ఆమె నీకు చెల్లెలు వరస అవుతుంది. కాబట్టి నువ్వు ఆమెను ‘చెల్లి’ అని పిలవాలని  చెప్పాడు. దీంతో తాను రెండేళ్లు లేకపోతే, తన భార్యను పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెను చెల్లి అని పిలవమని చెప్పడంతో రగిలిపోయాడు నాగులసాయి. ఈ కారణంతోనే తాను అతడిపై దాడి చేశానంటూ నిందితుడు నారాయణగూడ పోలీసుల విచారణలో వెల్లడించాడు మంగళవారం నిందితుడు నాగుల సాయిని పోలీసులు రిమాండ్కు తరలించారు.

Latest Videos

తనను వదిలేసి ప్రియుడితో ఉంటోందని.. భార్యతో సహా ముగ్గురిమీద పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త...

ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట్ గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగుల సాయి వృత్తిరీత్యా బ్యాండ్ వాయిస్తుంటాడు. బ్యాండ్ పని లేనప్పుడు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవాడు.  అతని స్నేహితుడి ద్వారా చిక్కడపల్లికి చెందిన ఆర్తితో  పరిచయమయ్యింది. దీంతో  2014లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే,  ఇద్దరికీ గొడవలు జరుగుతుండడంతో కొద్దిరోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. 

ఈ క్రమంలో ఆర్తీ అన్న జితేంద్రపై నాగులసాయి దాడిచేసి ఏడాదిపాటు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టు ధిక్కారం కేసులో మరో ఏడాది జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో జితేంద్ర భార్య.. ఆర్తీకి నాగరాజును పరిచయం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు విష్ణు జన్మించాడు. మంటల్లో గాయపడిన విష్ణు దాడి జరిగిన మరుసటి రోజే మరణించాడు.

గర్భంలో ఉన్న శిశువు మృతి….
అందర్నీ ఒకేసారి చంపాలనే ఉద్దేశంతో కుమారుడితో సహా ఇద్దరూ ఒకే చోట ఉన్నప్పుడు పెట్రోల్ పోసాడు నాగుల సాయి. ఈ దాడిలో పది నెలల విష్ణు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం నాగరాజు సైతం చనిపోగా.. సోమవారం రాత్రి ఆర్తి గర్భంలోని ఐదు నెలల శిశువు మృతి చెందింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని గాంధీ ఆస్పత్రి వైద్యులు  వెల్లడించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. 

click me!