సరూర్‌నగర్ యువకుడి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. తెరపైకి తండ్రి ‘అక్రమ సంబంధం’

Siva Kodati |  
Published : Sep 03, 2022, 04:40 PM IST
సరూర్‌నగర్ యువకుడి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. తెరపైకి తండ్రి ‘అక్రమ సంబంధం’

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్ నగర్ యువకుడి కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. అయితే ఈ వ్యవహరంలో ట్విస్ట్ నెలకొంది. తండ్రి అక్రమ సంబంధంతో పాటు కుటుంబ కలహాలతోనే యువకుడిని కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్ నగర్ యువకుడి కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. గురువారం అర్ధరాత్రి నడిరోడ్డుపై యువకుడిని కొట్టి , కారులో బలవంతంగా ఎక్కించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సరూర్ నగర్‌ పోలీసులకు యువకుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేస్తున్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే యువకుడు క్షేమంగా బయటపడ్డాడు. అయితే కిడ్నాప్‌కు గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు. యువకుడి కిడ్నాప్ వెనుక పీఎన్‌టీ కాలనీకి చెందిన లంకా సుబ్రమణ్యం , స్థానిక కార్పోరేటర్ బద్దం ప్రేమ్ హస్తం వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. బద్దం ప్రేమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. సుబ్రమణ్యం తండ్రి వివాహేతర సంబంధంతో పాటు కుటుంబ కలహాలతోనే యువకుడిని కిడ్నాప్ చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. కార్పోరేటర్‌తో పాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!