క్రికెట్ బెట్టింగ్ కేసులో ట్విస్ట్: వెలుగులోకి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల పేర్లు... సోమన్న కోసం గాలింపు

Siva Kodati |  
Published : Jun 23, 2021, 02:59 PM IST
క్రికెట్ బెట్టింగ్ కేసులో ట్విస్ట్: వెలుగులోకి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల పేర్లు... సోమన్న కోసం గాలింపు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ క్రికెట్ బెట్టింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా 13 రోజుల్లో రూ.20 కోట్ల లావాదేవీలు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ క్రికెట్ బెట్టింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా 13 రోజుల్లో రూ.20 కోట్ల లావాదేవీలు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు. ముఠాకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న సోమన్న ప్రస్తుతం పరారీలో వున్నాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణలకు చెందిన ప్రముఖుల తరపున సోమన్న బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:హైద్రాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: నిందితుల నుండి రూ. 21 లక్షలు సీజ్

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లకే బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఐదు యాప్‌లతో పాటు సొంత నెట్‌వర్క్‌తో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌పై బెట్టింగ్ చేస్తూ సోమన్న ముఠా మంగళవారం పోలీసులకు దొరికిన సంగతి తెలిసిందే. నిందితుల వద్ద నుంచి రూ.21 లక్షల నగదు స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు. 
 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu