తెలంగాణ: ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులకు మార్కులు ఇలా.. మార్గదర్శకాలు ఇవే..!!

Siva Kodati |  
Published : Jun 23, 2021, 02:13 PM IST
తెలంగాణ: ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులకు మార్కులు ఇలా.. మార్గదర్శకాలు ఇవే..!!

సారాంశం

ఇంటర్ సెకండియర్ మార్కులకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ విధివిధానాలను ఖరారు చేసింది. మొదటి సంవత్సరం వచ్చిన మార్కులనే సెకండియర్‌కు కూడా పరిగణనలోనికి తీసుకుంటామని చెబుతోంది. అలాగే ప్రాక్టీకల్స్‌కు వంద శాతం మార్కుల్ని కేటాయిస్తామని విద్యాశాఖ వెల్లడించింది

ఇంటర్ సెకండియర్ మార్కులకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ విధివిధానాలను ఖరారు చేసింది. మొదటి సంవత్సరం వచ్చిన మార్కులనే సెకండియర్‌కు కూడా పరిగణనలోనికి తీసుకుంటామని చెబుతోంది. అలాగే ప్రాక్టీకల్స్‌కు వంద శాతం మార్కుల్ని కేటాయిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఫస్ట్ ఇయర్ బ్యాక్ లాగ్స్ వుంటే 35 శాతం మార్కులతో పాస్ చేస్తామని తెలిపింది.

Also Read:తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు: సబిత అధికారిక ప్రకటన

సెకండియర్‌లోనూ అదే సబ్జెక్ట్‌లకు 35 శాతం మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. పరీక్ష ఫీజు కట్టిన విద్యార్ధులకు 35 శాతం మార్కులతో  పాస్ చేస్తామని తెలిపింది. అలాగే ఎవరైనా విద్యార్ధులకు ఈ మార్కులు నచ్చని పక్షంలో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇస్తామని వెల్లడించింది. అయితే ఈ సౌకర్యం సెకండియర్  విద్యార్ధులకు మాత్రమే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ విద్యార్ధులతో పాటు ప్రైవేట్ వారికి కూడా 35 శాతం మార్కులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే