హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాబుద్దీన్ ఖాద్రీ అనే యువకుడు తన మిత్రులతో కలిసి తన 19వ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు మొయినాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వున్నట్లుగా సమాచారం. అలాగే నిందితులు బాబుద్దీన్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి ప్రాణాలను తీసిన కేసులో బాబుద్దీన్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.
ALso Read: బండ్లగూడ సన్ సిటీ దగ్గర రోడ్డు ప్రమాదం, తల్లీకూతుళ్లు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు...
కాగా.. మంగళవారం ఉదయం బండ్లగూడ సన్ సిటీ వద్ద మార్నింగ్ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను బండ్లగూడ లక్ష్మీనగర్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు. మృతి చెందిన ఇద్దరు తల్లి కుమార్తెలు అనురాధ, మమతగా పోలీసులు తెలిపారు.