హైదరాబాద్ లో దారుణం.. 12 యేళ్ల బాబు మృతదేహాన్ని పీక్కుతిన్న వీధి కుక్కలు...!

Published : May 20, 2022, 08:05 AM IST
హైదరాబాద్ లో దారుణం.. 12 యేళ్ల బాబు మృతదేహాన్ని పీక్కుతిన్న వీధి కుక్కలు...!

సారాంశం

హైదరాబాద్ లో హృదయవిదారక ఘటన జరిగింది. ఓ పన్నెండేళ్ల బాలుడి మృతదేహాన్నివీధి కుక్కలు పీక్కుతిన్నాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

హైదరాబాద్ : Hyderabadలో దారుణం జరిగింది. నగరంలోని కుల్సుంపురలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. 12 యేళ్ల బాబు మృతదేహాన్ని stray dogs పీక్కుతిన్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన బాలుడిని సోఫియన్ గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం dead bodyని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బాబును ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

మృతదేహం లభ్యమైన ప్రదేశానికి కాస్త దూరంలో మూసీనది పారుతూ ఉండడంతో కుక్కలు మృతదేహాన్ని అక్కడినుంచి లాక్కొచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. సోఫియన్ తండ్రి సయ్యద్ కార్వాన్ లో సబ్జీమండీలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. అక్కడినుంచి బాలుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు ఇది చాలా నిర్మానుష్యప్రాంతం. 20 రోజుల కిందట కూడా ఇక్కడ ఓ హత్య జరిగింది. కొద్ది రోజుల కిందట లంగర్ హౌజ్ ప్రాంతంలో రెండేళ్ల బాలుడి మృతదేహాన్ని వీధికుక్కలు పీక్కుతిన్నాయి. ఇలాంటి ఘటనలు జరగడానికి నిర్మానుష్య ప్రాంతాలు కావడం, మందుబాబులు రాత్రుళ్లు సంచరిస్తూ ఉండడం.. చెత్తా చెదారం నిండి ఉండడం కారణాలుగా కనిపిస్తున్నాయి. 

సోఫియన్ తండ్రి సయ్యద్ ను పోలీసులు విచారిస్తున్నారు. సోఫియన్ తలకు గాయం అయ్యింది. అయితే అది తలపై కొట్టి చంపడం వల్ల అయ్యిందా.. చంపి మూసీలో పడేసిన సమయంలో అయ్యిందా.. వీధికుక్కలు పీక్కుతినే సమయంలో అయ్యిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కార్వాన్ నుంచి జియాగూడా వరకు.. సబ్జిమండీ నుంచి కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించనున్నారు. 

కాగా, వావివరుసలు మరచి ఓ College student సొంత చెల్లి పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ఐదు నెలల Pregnant అయింది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కేరళ నుంచి నగరానికి వలస వచ్చిన ఓ కుటుంబం బాచుపల్లి పరిధిలోని ఓ కాలనీలో నివాసం ఉంటుంది.  కుటుంబ యజమాని వ్యాపారం నిర్వహిస్తుండగా, భార్య ఐటీ ఉద్యోగి.  వీరి కుమారుడు (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె(13) Ninth grade చదువుతోంది. వీరిద్దరూ ఇంట్లో ఒకే గదిలో నిద్రించేవారు.

ఈ నేపథ్యంలో చెల్లెలిని లోబరుచుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు అన్న. తర్వాత చెల్లికి కడుపు నొప్పి రావడంతో మాదాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. దాంతో బాలిక గర్భవతి అని తేలింది. బాలికకు అబార్షన్  చేయించడానికి  ఈస్ట్ మారేడ్పల్లి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు విషయాన్ని మేడ్చల్ జిల్లా  బాలల పరిరక్షణ  విభాగం (డిసిపియు)కు  సమాచారం ఇచ్చారు. ఆ విభాగం అధికారుల ఫిర్యాదుమేరకు బాచుపల్లి పోలీసులు నిందితుడిపై  ipc 376(2) సెక్షన్ తో పాటు  పోక్సో చట్టం కింద ఈనెల 17న కేసు నమోదు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించినట్లు సీఐ కె. నరసింహారెడ్డి తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Pays Tribute At NTR
NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu