17యేళ్ల అన్న 13యేళ్ల సొంతచెల్లిపై అత్యాచారం.. ఐదునెలల గర్భం.. అబార్షన్ కోసం వెళ్లడంతో వెలుగులోకి...

Published : May 20, 2022, 06:41 AM IST
17యేళ్ల అన్న 13యేళ్ల సొంతచెల్లిపై అత్యాచారం.. ఐదునెలల గర్భం.. అబార్షన్ కోసం వెళ్లడంతో వెలుగులోకి...

సారాంశం

వావివరసలు మరిచిన ఓ దారుణమైన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఓ మైనర్ అన్న.. తన చిన్నారి చెల్లిమీద పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. 

హైదరాబాద్ : వావివరుసలు మరచి ఓ College student సొంత చెల్లి పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ఐదు నెలల Pregnant అయింది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కేరళ నుంచి నగరానికి వలస వచ్చిన ఓ కుటుంబం బాచుపల్లి పరిధిలోని ఓ కాలనీలో నివాసం ఉంటుంది.  కుటుంబ యజమాని వ్యాపారం నిర్వహిస్తుండగా, భార్య ఐటీ ఉద్యోగి.  వీరి కుమారుడు (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె(13) Ninth grade చదువుతోంది. వీరిద్దరూ ఇంట్లో ఒకే గదిలో నిద్రించేవారు.

ఈ నేపథ్యంలో చెల్లెలిని లోబరుచుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు అన్న. తర్వాత చెల్లికి కడుపు నొప్పి రావడంతో మాదాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. దాంతో బాలిక గర్భవతి అని తేలింది. బాలికకు అబార్షన్  చేయించడానికి  ఈస్ట్ మారేడ్పల్లి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు విషయాన్ని మేడ్చల్ జిల్లా  బాలల పరిరక్షణ  విభాగం (డిసిపియు)కు  సమాచారం ఇచ్చారు. ఆ విభాగం అధికారుల ఫిర్యాదుమేరకు బాచుపల్లి పోలీసులు నిందితుడిపై  ipc 376(2) సెక్షన్ తో పాటు  పోక్సో చట్టం కింద ఈనెల 17న కేసు నమోదు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించినట్లు సీఐ కె. నరసింహారెడ్డి తెలిపారు. 

కాగా, ఇలాంటి వావివరసలు లేని ఘటనే ఉత్తరాఖండ్ లో ఒకటి వెలుగుచూసింది. సమాజం తలదించుకునే సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వావివరసలు మరిచి అక్రమసంబంధాలు, వివాహాలు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే వీటిలో కొన్ని నిజాలు కాగా, మరికొన్ని అవాస్తవాలుగా.. అనుమానాలుగా మిగిలిపోతున్నాయి. అలాంటి ఓ సంఘటన మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. సాక్షాత్తూ కన్నతల్లే.. కొడుకును పెళ్లి చేసుకుందని.. ఓ భర్తే స్వయంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తున్నారు.

తన భార్య కుమారుడినే వివాహం చేసుకుందని సాక్షాత్తు భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఉత్తరాఖండ్లోని ఉద్దంసింగ్ నగర్ లోని బాజపూర్ ప్రాంతానికి చెందిన తన భార్య బాబ్లి కుమారుడిని పెళ్లాడింది భర్త ఇంద్రారామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య బాబ్లీ కి 11 ఏళ్ల వయసులోనే వివాహం కావడంతో ఆమెకు మొదటి భర్త నుంచి ఇద్దరు కుమారులు ఉన్నారు అని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తనను రెండో వివాహం చేసుకుందని ఇంద్రారామ్ చెప్పాడు. బాబ్లీ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  

ఇటీవలి కాలంలో మొదటి వివాహం వల్ల పుట్టిన ఆమె కుమారుల్లో ఒకరు ఇంటికి వెళ్లడం ప్రారంభించిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె, ఆమె కుమారుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారని భర్త ఆరోపించాడు. తన ఇంట్లో నుంచి రూ. 20 వేలు తీసుకుని వెళ్ళిపోయిందని ఆరోపించాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils NTR Statue
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Pays Tribute At NTR