తనను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ యువతి .. ప్రముఖ టీవీ ఛానెల్‌కు చెందిన న్యూస్ యాంకర్‌ను కిడ్నాప్ చేసి నిర్బంధించింది. కానీ, ఆ యువతి బారి నుంచి తప్పించుకున్న ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాల్ని అరెస్ట్ చేశారు.
ప్రముఖ టీవీ యాంకర్‌ను ఓ యువతి కిడ్నాప్ చేయడంలో హైదరాబాద్ లో సంచలనంగా మారింది. అతడ్ని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో ఆ యువతి అతడ్ని కిడ్నాప్ చేయించింది. కానీ, ఆ యువతి బారి నుంచి తప్పించుకున్న ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాల్ని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆసలు ట్విస్ట్ బయటబడింది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. భారత్ మాట్రిమోని(Bharat Matrimony) అనే యాప్ లో న్యూస్ యాంకర్ ప్రణవ్ అనే యువకుడుతో త్రిష అనే యువతి మూడు నెలల పాటు చాటింగ్ చేసింది. కానీ, కొన్ని రోజుల తరువాత ఆ యువతితో ఆ యువకుడు చాటింగ్ చేయకుండా.. ముఖం చాటేశాడు. దీంతో తనకు ఆ యువకుడు ఎక్కడ దూరమవుతాడో అనే అనుమానంతో ప్రణవ్ ను ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో అయిదుగురి వ్యక్తులతో కిడ్నాప్ చేయించింది.
ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి ఆ యాంకర్ ను ఒత్తిడి చేసింది. ఆ యాంకర్ తనకు అసలూ ఇష్టం లేదని వారించే సరికి బెదిరింపులకు గురి చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం నిందితురాలి బారి నుంచి తప్పించుకున్న ఆ యాంకర్ తప్పించుకు్న్నాడు. వెంటనే ఆ
బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతే కిడ్నాప్ చేయించినట్లు గుర్తించారు. నిందితురాలు త్రిషను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు.. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
అసలు ట్విస్ట్ తెలిస్తే.. దిమ్మతిరగాల్సిందే..
పోలీసుల విచారణలో అసలూ విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ మాట్రిమోనిలో(Bharat Matrimony) ప్రణవ్ ఫొటోతో చైతన్య రెడ్డి అనే మరో యువకుడు ఆ యువతితో మూడు నెలల పాటు చాటింగ్ చేసినట్టు గుర్తించారు. ఆ విషయం తెలియని యువతి మాత్రం న్యూస్ యాంకర్ ప్రణయ్ తనతో చాటింగ్ చేస్తున్నట్లు భ్రమ పడింది. ఈ ఇటీవల తనతో చాటింగ్ చేయడం లేదనీ, ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో ప్రణవ్ ను అయిదుగురి వ్యక్తులతో కిడ్నాప్ చేయించింది.