వారణాసిలో నామినేషన్ల తిరస్కరణ: ఈసీకి తెలంగాణ రైతుల ఫిర్యాదు

By narsimha lodeFirst Published May 3, 2019, 2:54 PM IST
Highlights

తమ నామినేషన్ల తిరస్కరించడంతో  వారణాసి ఎన్నికల రిటర్నింగ్  అధికారి తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ, తమిళనాడు రైతులు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.  
 

నిజామాబాద్: తమ నామినేషన్ల తిరస్కరించడంతో  వారణాసి ఎన్నికల రిటర్నింగ్  అధికారి తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ, తమిళనాడు రైతులు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.  

వారణాసిలో ఎన్నికల అధికారులు తాము నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పసుపు రైతులు ఫిర్యాదు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన 24 మంది రైతుల నామినేషన్లను కూడ ఎన్నికల అధికారులు తిరస్కరించారు. 

బీజేపీ నేతలు, పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు కూడ తాము నామినేషన్లు వేయకుండా  అడ్డుకొన్నారని పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు నరసింహనాయుడు ఆరోపించారు.  పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తోనే తాము వారణాసిలో నామినేషన్లు వేశామని ఆయన చెప్పారు.

వారణాసిలో తాము అడుగుపెట్టిన సమయం నుండి  నామినేషన్ల తిరస్కరణ వరకు చోటు చేసుకొన్న పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘానికి  పసుపు రైతులు ఫిర్యాదు చేశారు.
 

click me!