ఫలించిన కేసీఆర్ దౌత్యం: పాలమూరుకు నీటి విడుదలకు కుమారస్వామి ఆదేశాలు

Siva Kodati |  
Published : May 03, 2019, 11:45 AM ISTUpdated : May 03, 2019, 01:24 PM IST
ఫలించిన కేసీఆర్ దౌత్యం: పాలమూరుకు నీటి విడుదలకు కుమారస్వామి ఆదేశాలు

సారాంశం

జూరాల ప్రాజెక్ట్ దిగువ భాగంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొన్ని గ్రామాలు వేసవి కారణంగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కుమారస్వామికి కేసీఆర్ ఫోన్ చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కర్ణాటక సీఎం కుమారస్వామితో మంతనాలు జరిపారు. అవి రాజకీయ చర్చలు కాదు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి అంతకన్నా కాదు. జూరాల ప్రాజెక్ట్ దిగువ భాగంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొన్ని గ్రామాలు వేసవి కారణంగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కుమారస్వామికి కేసీఆర్ ఫోన్ చేశారు. జూరాల నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

దీనిపై స్పందించిన కర్ణాటక సీఎం మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చటం కోసం నారాయణ్‌పూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని  అధికారులను ఆదేశించారు.

ఈ విషయాన్ని వెనువెంటనే కుమారస్వామి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి తెలిపారు.  ఇది పాలమూరు జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తరపున కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ శుక్రవారం సాయంత్రం నుంచి జూరాలకు నీటి విడుదల ప్రారంభం కానున్నది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి