నిజామాబాద్‌లో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి

Published : May 03, 2019, 02:41 PM IST
నిజామాబాద్‌లో  ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి

సారాంశం

నిజామాబాద్‌ పట్టణంలోని  కంఠేశ్వర్ నగర్‌లో  ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు.ఈ ఘటన పట్టణంలో సంచలనం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

నిజామాబాద్: నిజామాబాద్‌ పట్టణంలోని  కంఠేశ్వర్ నగర్‌లో  ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు.ఈ ఘటన పట్టణంలో సంచలనం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

శ్రీకాంత్, మహేష్, సాయి అనే యువకులు కంఠేశ్వర్  నగర్‌లోని ఓ గదిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. ఈ ముగ్గురు సమీపంలోని ఓ టీ స్టాల్‌ను నడుపుతున్నారు.ఈ ఇద్దరిని శ్రీకాంత్ హత్య చేశాడా.. ఇంకా ఎవరైనా  ఈ ఘటనకు పాల్పడి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 ఓ ఇంటి నుండి దుర్వాసన రావడంతో  స్తానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ సమాచారం ఆధారంగా ఆ ఇంటి తలుపులు పగుల గొట్టి చూస్తే రెండు మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి.పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

SIR గడువు మరోసారి పొడిగింపు.. ఓటర్లకు ఈసీ కీలక అవకాశం, చివ‌రి తేదీ ఎప్పుడంటే
ఆప్త మిత్రుడిని కోల్పోయా పెద్ది మరణంపై కేసీఆర్ ఎమోషనల్ | BRS Leader Peddi Sudarshan Reddy