ప్రజాభీష్టం మేరకు తుమ్మల నిర్ణయాలు: యుగంధర్

By narsimha lode  |  First Published Aug 25, 2023, 2:58 PM IST

ప్రజాభీష్టం మేరకు  తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయాలుంటాయని ఆయన తనయుడు యుగంధర్ ప్రకటించారు.


ఖమ్మం: అనుచరులతో మాట్లాడి తుమ్మల నాగేశ్వరరావు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారని  ఆయన తనయుడు  యుగంధర్ ప్రకటించారు.శుక్రవారంనాడు ఖమ్మంలో  యుగంధర్  ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 పాలేరు నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి  సీతారామ ప్రాజెక్టును పూర్తి  చేయాలనేది  తుమ్మల నాగేశ్వరరావు అభిమతమన్నారు.  సీతారామ ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలోని  10 లక్షల ఎకరాల ఆయకట్టుకు  నీటిని అందించాలనే లక్ష్యంతో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారన్నారు. పాలేరు నుండే పోటీ చేయనున్నట్టుగా గతంలో  తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో  ఆయన అనుచరుల్లో అసంతృప్తి నెలకొందని  యుగంధర్ చెప్పారు.  అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను  తుమ్మల నాగేశ్వరరావు ప్రకటిస్తారని యుగంధర్ చెప్పారు.

Latest Videos

undefined

also read:నాయకన్‌గూడెం వద్ద స్వాగతం: భావోద్వేగానికి గురైన తుమ్మల

ప్రజల అభీష్టం మేరకే తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవితవ్యం ఉంటుందన్నారు. భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళిక లేదన్నారు.  బీఆర్ఎస్ ను వీడలేదని  యుగంధర్ స్పష్టం చేశారు. పాలేరు స్థానం నుండి బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో క్యాడర్ అసంతృప్తితో ఉందని యుగంధర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ది పనులు చేయని గ్రామం లేదని  యుగంధర్ ప్రకటించారు.

ఈ నెల  21న కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాాలో తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కలేదు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు  అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఇవాళ ఖమ్మంలో అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు.హైద్రాబాద్ నుండి భారీ కాన్వాయ్ తో తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మంకు బయలుదేరారు.  నాయకన్ గూడెం వద్ద తుమ్మల నాగేశ్వరరావుకు  ఆయన అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు.ఖమ్మంలో  సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై  చర్చించనున్నారు.

2018 ఎన్నికల్లో పాాలేరునుండి పోటీ చేసి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఇదే స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన  కందాల ఉపేందర్ రెడ్డి  కాంగ్రెస్  ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అయితే తాజాగా  బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో పాలేరు నుండి కందాల ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు. అయితే వచ్చే ఎన్నికల్లో  పాలేరు నుండి పోటీ  చేయాలని తుమ్మల నాగేశ్వరరావు  రంగం సిద్దం  చేసుకున్నారు. అయితే  ఈ సమయంలో బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కపోవడంతో  ఆయన షాక్ కు గురయ్యారు.ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీల నుండి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానాలు అందాయి. అయితే తుమ్మల నాగేశ్వరరావు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం  రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

ఇవాళ  అనుచరులతో  తుమ్మల నాగేశ్వరరావు భేటీ కీలకంగా  చెబుతున్నారు.  ఈ సమావేశంలోనే తన భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు. 

click me!