ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ కార్పోరేటర్ ఇంటిని ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Aug 25, 2023, 02:50 PM IST
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ కార్పోరేటర్ ఇంటిని ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు, ఉద్రిక్తత

సారాంశం

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీజేపీ చంపాపేట్ డివిజన్ కార్పోరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అసభ్యపదజాలంతో దూషించడంతో ఎల్బీ నగర్‌లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. 

హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీజేపీ చంపాపేట్ డివిజన్ కార్పోరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అసభ్యపదజాలంతో దూషించడంతో ఈ గొడవ మొదలైంది. మధుసూదన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ సుమారు రెండు వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు , ఎమ్మెల్యే అనుచరులు, కార్పోరేటర్ ఇంటిని ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం దూషించుకోవడంతో పాటు గొడవకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్