మోడీ నా శిష్యుడు, ఈ నెల 30న ఓటు వేయకండి.. ఇంట్లో కూర్చోండి: కేఏ పాల్ కామెంట్లు

By Mahesh K  |  First Published Nov 13, 2023, 4:05 PM IST

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బీసీ కాదని, తన శిష్యుడని అన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప సభ నిర్వహించడానికి మందకృష్ణ మాదిగకు రూ. 72 కోట్లు ముట్టాయని తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నెల 30వ తేదీన మూడు పార్టీలుకూ ఓటు వేయవద్దని, ఇంట్లోనే కూర్చోవాలని సూచనలు చేశారు.
 


హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కాదని, ఆయన తన శిష్యుడు అని అన్నారు.  అలాగే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి అనూహ్యంగా ప్రజాశాంతి పార్టీ వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పార్టీ పోటీలో లేదు. దీంతో ఈసీపై ఆయన సీరియస్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. పోటీలో లేనందున ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30వ తేదీన ఎన్నికల్లో మూడు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయవద్దని, ఇంట్లోనే కూర్చోవాలని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ఎస్సీ వర్గీకరణ ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. మందకృష్ణ మాదిగను తన పార్టీలో  చేరాలని కోరితే రూ. 25 కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. అంతేకాదు, మొన్న హైదరాబాద్‌లో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభ నిర్వహణ కోసం రూ. 72 కోట్లు ముట్టాయని ఆరోపించారు. మెడీని గతంలో ఇష్టం వచ్చినట్టు మందకృష్ణ మాదిగ తిట్టారని, అలాంటిది ఇప్పుడు మోడీని దేవుడిని చేసి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

Latest Videos

Also Read: సీపీఐ, సీపీఎం ప్రత్యర్థులా? మిత్రపక్షాలా? పాలేరు సీటుపై వామపక్షాల ఓట్లు ఎటు?

ఈ నెల 11వ తేదీన సికింద్రాబాద్‌లో పరేడ్ గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. మోడీని మందకృష్ణ పలుమార్లు ప్రశంసించారు. ఎస్సీలకు ఆయన పెద్దన్న అని వివరించారు. దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీపై ఎక్కువగా దుష్ప్రచారం జరగడం వల్లే బలహీనంగా ఉన్నదని, ఇక్కడ బీజేపీ పుంజుకోవడానికి తాము మోడీ వెంటే వెన్నంటి నడుస్తామని స్పష్టం చేశారు.

click me!