ఆ లిస్ట్ ఉత్తిదే...మా అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు : ఎల్ రమణ

By Arun Kumar PFirst Published Sep 22, 2018, 12:57 PM IST
Highlights

తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి ఎన్నికల బరిలో దిగడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కాంగ్రెస్, టిడిపి, టీజెఎస్, సిపిఐ లు పొత్తుల కోసం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో పొత్తుల్లో బాగంగా టిడిపి పోటీచేయనున్న నియోజకవర్గాలివే అంటూ ఓ లిస్టు చక్కర్లు కొడుతోంది. దీనిపై టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు.

తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి ఎన్నికల బరిలో దిగడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కాంగ్రెస్, టిడిపి, టీజెఎస్ లతో పాటు వామపక్ష పార్టీలు పొత్తుల కోసం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో పొత్తుల్లో బాగంగా టిడిపి పోటీచేయనున్న నియోజకవర్గాలివే అంటూ ఓ లిస్టు చక్కర్లు కొడుతోంది. దీనిపై టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు.

మహాకూటబిని విచ్చిన్నం చేయడానికే టీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందని రమణ ఆరోపించారు. టిడిపి అభ్యర్థుల లిస్ట్ ను కాంగ్రెస్ కు ఇచ్చినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అలాంటి లిస్ట్ ఏది తాము తయారు చేయలేదని అన్నారు. ప్రస్తుతం పార్టీల మధ్య పొత్తుల సంప్రదింపులు మాత్రమే జరుగుతున్నట్లు తెలిపారు. సీట్ల పంపకాలు ఇంకా పూర్తికాకముందే అభ్యర్థులకు జాబితా ఎలా ప్రకటిస్తామని ప్రశ్నించారు. టిడిపి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను అదిష్టానం ఎంపిక చేస్తుందని రమణ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

మహా కూటమి: 25 సీట్లు టీడీపీ టార్గెట్, అభ్యర్థులు వీరే...

click me!