మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

By sivanagaprasad kodati  |  First Published Nov 17, 2018, 9:28 AM IST

నందమూరి సుహాసిని తన కూతురులాంటిదన్నారు టీటీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి. ఇవాళ సుహాసినితో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుటుంబంతో తనకు తొలి నుంచి మంచి అనుబంధం ఉందన్నారు


నందమూరి సుహాసిని తన కూతురులాంటిదన్నారు టీటీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి. ఇవాళ సుహాసినితో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుటుంబంతో తనకు తొలి నుంచి మంచి అనుబంధం ఉందన్నారు.

తన మిత్రుడు, సోదరుడు హరికృష్ణ ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. అతని కుమార్తె సుహాసిని విజయానికి కృషి చేస్తానని పెద్దిరెడ్డి ప్రకటించారు. కూకట్‌పల్లి తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. టీడీపీ ద్రోహం చేశారని మండిపడ్డారు.

Latest Videos

సైకిల్ గుర్తుపై పోటీ చేసి విలువలు లేకుండా పార్టీ మారారని విమర్శించారు. మాధవరం ఓటమే తన లక్ష్యమన్నారు. గత ఎన్నికల్లో ఈ విధంగా చేసిన ద్రోహులందరికీ తగిన గుణపాఠం చెబుతామని పెద్దిరెడ్డి హెచ్చరించారు. సుహాసినిని కూకట్‌పల్లి ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీ గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 

click me!