ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

By sivanagaprasad kodati  |  First Published Nov 17, 2018, 8:35 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇవాళ నామినేషన్ వేయనున్నారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇవాళ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేయడానికి వెళ్లేముందు సుహాసిని తన తాత దివంగత సీఎం ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

ఉదయం ఎనిమిది గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో బాబాయ్ బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళుర్పించారు. అనంతరం ఆమె తండ్రి నందమూరి హరికృష్ణకు నివాళులర్పించేందుకు ఫిలింనగర్ మహాప్రస్థానానికి బయలుదేరారు. సుహాసిని వెంట నందమూరి కుటుంబసభ్యులు, పలువురు టీటీడీపీ నేతలు ఉన్నారు.

Latest Videos

click me!