ముగిసిన టీటీడీపీ నేతల భేటీ.. మూడు కమిటీలు ఖరారు

By sivanagaprasad KodatiFirst Published 9, Sep 2018, 3:12 PM IST
Highlights

తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది. రానున్న ఎన్నికలను పురస్కరించుకుని మూడు కమిటీలను నేతలు ఖరారు చేశారు. ఎన్నికల సమన్వయ కమటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలను టీటీడీపీ నియమించింది

తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది. రానున్న ఎన్నికలను పురస్కరించుకుని మూడు కమిటీలను నేతలు ఖరారు చేశారు. ఎన్నికల సమన్వయ కమటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలను టీటీడీపీ నియమించింది.

ఎన్నికల సమన్వయ కమటీలో ఎల్.రమణ, దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావును నియమించగా.. మేనిఫెస్టో కమిటీలో దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, డి.నర్సింహులు, అలీ మస్కతి, శోభారాణిలకు చోటు కల్పించారు. ప్రచార కమిటీలో గరికపాటి మోహన్ రావు, సండ్ర వెంకట వీరయ్య, కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, లక్ష్మణ్ నాయక్ రమావత్‌లను నియమించారు.

తెలంగాణలో ఎన్నికలు, ప్రచార వ్యూహాంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయం టీటీడీపీ నేతలతో సమావేశమయ్యారు. కలిసివచ్చే వారితో పొత్తు పెట్టుకుందామని.. చర్చలు జరపాల్సిందిగా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆయన అమరావతికి వెళ్లిన తర్వాత టీటీడీపీ నేతలు మూడు కమిటీలపై చర్చించి సభ్యులను నియమించారు. 

 

Last Updated 9, Sep 2018, 3:19 PM IST