70 ఏళ్లలో తొలిసారి ఓటు హక్కు: కేసీఆర్‌‌కు షాకిచ్చిన గద్దర్

By narsimha lodeFirst Published Sep 9, 2018, 1:54 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ రద్దు పై ప్రజా కవి గద్దర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పట్టిన శని 9 మాసాల ముందే  వదిలిందని చెప్పారు.


హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ రద్దు పై ప్రజా కవి గద్దర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పట్టిన శని 9 మాసాల ముందే  వదిలిందని చెప్పారు.
ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

త్యాగాల తెలంగాణ సాధనలో ప్రజాభిప్రాయం మేరకు  ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు గద్దర్ ప్రకటించారు.యువత రాజకీయాల్లో  శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు యువత రాజకీయాల్లో రావాలని ఆయన కోరారు.

 70 ఏళ్లలో తొలిసారిగా తాను ఓటరుగా తన పేరును నమోదు చేసుకొన్నట్టు గద్దర్ చెప్పారు. ఏడాది క్రితం రాజకీయాల్లో పోటీ చేయాలనే ఆసక్తిని తొలిసారిగా వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ రాజాకీయాలకు దూరంగా  ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన అప్పట్లోనే ప్రకటించారు.

ఎన్నికల బరిలోకి దిగాలని ఆయనను పలు పార్టీలు కోరుతున్నాయి. కడియం శ్రీహారి వరంగల్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో  వచ్చిన ఉప ఎన్నికల్లో  గద్దర్ ను సీపీఎం బరిలోకి దింపాలని భావించింది.  అయితే ఆ సమయంలో ఆయన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు.

మరోవైపు ఎన్నికల రాజకీయాలపై క్రమంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.  తాజాగా ఇదే రకమైన ప్రకటనను గద్దర్ చేశారు. అయితే  గద్దర్ తనయుడు సూర్యం  ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

click me!