గో సంరక్షకుల మృతిపై విచారం వ్య‌క్తం చేసిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

Published : Jan 17, 2022, 06:04 PM IST
గో సంరక్షకుల మృతిపై విచారం వ్య‌క్తం చేసిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

సారాంశం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో గో సంరక్షకులు పృథ్వి తో పాటు మరొకరు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారం వ్యక్తం చేశారు. 

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి (yadadri bhuvangiri) జిల్లా చౌటుప్పల్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో గో సంరక్షకులు పృథ్వి (pruthvi) తో పాటు మరొకరు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ttd chiarman yv subbareddy) విచారం వ్యక్తం చేశారు. త్వ‌ర‌లోనే మృతుల కుటుంబాల‌ను ప‌ర‌మార్శిస్తాన‌ని తెలిపారు. జ‌న‌వ‌రి 16వ తేదీన  ఓ కారులో ఏడుగురు గో రక్షకులు ప్ర‌యాణిస్తున్నారు. ఆ కారు చౌటుప్పల్ (chotuppal) వద్దకు రాగానే ఓ బ‌స్సు ఢీకొట్టింది.   ఈ ఘ‌ట‌న‌లో పృథ్వీతో ఇంకో వ్య‌క్తి  మృతి చెందారు. నలుగురు క్షేమంగా ఉండ‌గా.. ఒక‌రు హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌నను గోసంరక్షణ ఉద్యమ నాయకుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు  శివకుమార్ (shivakumar)ప్ర‌స్తుత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి తెలియ‌జేశారు. ప్ర‌మాద వివ‌రాలు చెప్పారు. ఈ ఘటనపై ఆయ‌న ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. త్వరలోనే మృతుల కుటుంబాలను పరామర్శిస్తాన‌ని తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu