దంతేవాడకు తెలంగాణ కొత్త బస్సు

First Published Sep 10, 2017, 8:44 PM IST
Highlights
  • అంతర్ రాష్ట్ర బస్సులను షురూ చేసిన తెలంగాణ ఆర్టీసి
  • జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

టీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేపట్టింది. తాజాగా తాండూరు - దంతేవాడ అంతర్ రాష్ట్ర సర్వీస్ ను ప్రారంభించింది. ఈ బస్సును రవాణా మంత్రి మహేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

రాష్ట్రం లో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం చేసేందుకు నష్టాల ఆర్టీసీ కి సీఎం కేసీఆర్ సుమారు 3 వేల కోట్లు అందించి ఆదరించారని మహేందర్ రెడ్డి కొనియాడారు.

టీఎస్ ఆర్టీసీ 6 రాష్ట్రాలకు అంతర్ రాష్ట్ర సర్వీస్ లను నడుపుతుందన్నారు.  కొత్తగా రాయ్ పూర్, దంతేవాడ (చత్తీస్గఢ్ ),సిరోంచ (మహారాష్ట్ర ), గోవా లకు సర్వీసు లు ప్రారంభమైనట్లు చెప్పారు.

రాష్ట్రం లో 42 డిపోలు లాభాల్లో ఉండగా, 53 డిపోలు గరిష్ఠంగా నష్టాలు తగ్గించాయని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.

click me!