కరోనా ఎఫెక్ట్: ఈ నెల 17 నుండి ఓయూ, జేఎన్‌టీయూలలో ఆన్‌లైన్ క్లాసులు

By narsimha lodeFirst Published Jan 16, 2022, 4:20 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో, జేఎన్‌టీయూ పరిధిలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఈ నెల 30 వ తేదీ వరకు రాష్ట్రంలో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

హైదరాబాద్: Telangana రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో  Online Class నిర్వహించాలని Osmania University నిర్ణయం తీసుకొంది. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని ఓయూ తెలిపింది.డీగ్రీ,పీజీ విద్యార్ధులకు కూడా ఆన్‌లైన్ క్లాసులు ఉంటాయని ఓయూ ప్రకటించింది. మరోవైపు JNTU కూడా ఆ నెల 30వ తేదీ వరకు ఆన్ లైన్ క్లాసులను నిర్వహించనున్నట్టు తెలిపింది. 

ఈ నెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున ఈ నెల 17 నుండి 30వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

 దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో Indiaలో కొత్తగా 2,71,202 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,71,22,164కి చేరింది.   కరోనాతో  314 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,86,066కి చేరింది. దీంతో  కరోనాను జయించిన వారి సంఖ్య 3,50,85721కి చేరింది.  నిన్న కరోనా నుంచి 1,38,331 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,50,377 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు13.69 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 94.51 శాతంగా నమోదైంది.

Corona యాక్టివ్ కేసులు 4.18 శాతంగా నమోదయ్యాయి. ఈ నెల 15న  దేశంలో 16,65,404 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 70,24,48,838కి చేరినట్టుగా తెలిపింది. 

మరోవైపు దేశంలో కరోనా Vaccination ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 66,21,395 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,56,76,15,454కి చేరింది. 

మరోవైపు దేశంలో omicron​ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7,743కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఈ నెల 8 నుండి విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది.  ఈ నెల 17న తెలంగాణ కేబీనెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో  కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను తెలంగాణ సర్కార్  ఆంక్షలను విధఇంచే అవకాశం ఉంది.

ఏపీ రాష్ట్రంలో మాత్రం విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే అవకాశం లేదని ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు తేల్చి చెప్పింది.ఈ నెల 8 నుండి 16వరకు విద్యా సంస్థలకు ఏపీ సర్కార్ సెలవులను ఇచ్చిన విషయం తెలిసిందే.

click me!