ఏడుపాయ‌ల వ‌న దుర్గమ్మను దర్శించుకున్న కవిత.. గాజులు తొడిగించుకుని సందడి (వీడియో)

By Siva KodatiFirst Published Oct 1, 2022, 9:43 PM IST
Highlights

మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గామాతను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత, పద్మా దేవేందర్ రెడ్డిలు అమ్మవారి సన్నిధిలో గాజులు తొడిగించుకున్నారు. 
 

మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత ఏడుపాయల వన దుర్గామాతను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత వెంట మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, తెలంగాణ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వున్నారు. ఈ సందర్భంగా కవిత, పద్మా దేవేందర్ రెడ్డిలు అమ్మవారి సన్నిధిలో గాజులు తొడిగించుకున్నారు. 

 

 

అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ... 100 మంది ఆడపడుచులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించినట్లు తెలిపారు. ఏడుపాయల ఆలయానికి ప్రత్యేక చరిత్ర వుందని కవిత అన్నారు. మల్లన్న సాగర్ అభివృద్ధితో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ది కోసం రూ.100 కోట్లు కేటాయించారని.. తాను కూడా ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని కవిత హామీ ఇచ్చారు.

 

 

click me!