కేసీఆర్ ప్రభుత్వానికి పతనం మెుదలైంది, తలసాని అతివద్దు: అశ్వత్థామరెడ్డి

By Nagaraju penumalaFirst Published Oct 12, 2019, 7:48 PM IST
Highlights

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి పతనం మొదలైందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులెవరూ అధైర్య పడొద్దని హితవు పలికారు. ఆర్టీసీ వ్యవహారంపై మంత్రి తలసాని శ్రీనివాస్ అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు అశ్వత్థామరెడ్డి. 
 

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ ఉద్యమ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. పోరాడి తమ డిమాండ్లను సాధించుకోవాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని సూచించారు. 

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం న్యాయపరంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. పోరాటంతోనే డిమాండ్లను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అశ్వత్థామరెడ్డి ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంపై విచారం వ్యక్తం చేశారు. 

ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి పతనం మొదలైందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులెవరూ అధైర్య పడొద్దని హితవు పలికారు. ఆర్టీసీ వ్యవహారంపై మంత్రి తలసాని శ్రీనివాస్ అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు అశ్వత్థామరెడ్డి. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మేం చూడాలా: ఆర్టీసీ కార్మికులకు మంత్రి తలసాని వార్నింగ్

ఉద్యమం పేరుతో విధ్వంసం చేస్తే ఉపేక్షించొద్దు: డీజీపీకి సీఎం కేసీఆర్ ఫోన్
 

click me!