ఉద్యమం పేరుతో విధ్వంసం చేస్తే ఉపేక్షించొద్దు: డీజీపీకి సీఎం కేసీఆర్ ఫోన్

By Nagaraju penumalaFirst Published Oct 12, 2019, 6:50 PM IST
Highlights

ప్రతీడిపో వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉద్యమం పేరుతో ఆందోళన కారులు విధ్వంసం చేస్తే సహించొద్దని హెచ్చరించారు. ప్రజలకు గానీ ఆర్టీసీకి గానీ ఇబ్బందులు కల్పిస్తే వారిపై కేసులు పెట్టాలని సూచించారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెపై సీఎం కేసీఆర్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సమ్మెను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు సీఎం కేసీఆర్. సమ్మె నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని బస్ డిపో, బస్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. 

ప్రతీడిపో వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉద్యమం పేరుతో ఆందోళన కారులు విధ్వంసం చేస్తే సహించొద్దని హెచ్చరించారు. ప్రజలకు గానీ ఆర్టీసీకి గానీ ఇబ్బందులు కల్పిస్తే వారిపై కేసులు పెట్టాలని సూచించారు.కేసులు పెట్టి కోర్టులకు పంపాలని ఆదేశించారు. 

రాబోయే మూడు రోజుల్లో బస్సులు పూర్తి స్థాయిలో నడుస్తాయని కేసీఆర్ తెలిపారు. బస్సులను అడ్డుకున్నా విడిచిపెట్టొద్దన్నారు. బందోబస్తులో మహిళా పోలీసులను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన వార్నెవరిని వదలొద్దని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.  

ఈ వార్తలు కూడా చదవండి

డీజీపీకి ఆదేశాలు: ఆర్టీసి సమ్మెపై కేసీఆర్ ప్రకటన పూర్తి పాఠం

ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మేం చూడాలా: ఆర్టీసీ కార్మికులకు మంత్రి తలసాని వార్నింగ్

click me!