మిలియన్ మార్చ్ తరహాలో ఛలో ట్యాంక్ బండ్: ఆర్టీసీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ

By sivanagaprasad Kodati  |  First Published Nov 2, 2019, 3:28 PM IST

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఈ నెల 9వ తేదీ వరకు కొత్త ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఎలాంటి ప్రకటన వచ్చినా కార్మికులెవరు భయాందోళనలకు గురికావొద్దన్నారు. కోర్టు ఆదేశాలు, కేబినెట్ సమావేశం నేపథ్యంలో తాజా పరిస్థితులపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చించారు


తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఈ నెల 9వ తేదీ వరకు కొత్త ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 3న అమరుల కోసం పల్లెబాట, 4న రాజకీయ పార్టీలతో కలిసి డిపోల దగ్గర నిరాహార దీక్ష, 5న రహదారుల దిగ్బంధం, 6న డిపోల ముందు నిరాహార దీక్ష, 7న ఆర్టీసీ కుటుంబసభ్యులతో డిపోల ఎదుట నిరసన దీక్షలు, 8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమం, 9న చలో ట్యాంక్ బండ్ నిర్వహించనున్నట్లు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.

ఎలాంటి ప్రకటన వచ్చినా కార్మికులెవరు భయాందోళనలకు గురికావొద్దన్నారు. కోర్టు ఆదేశాలు, కేబినెట్ సమావేశం నేపథ్యంలో తాజా పరిస్థితులపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చించారు.

Latest Videos

undefined

ఈ క్రమంలో ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తెలియజేసేందుకు గాను.. 4, 5 తేదీలలో ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను, కేంద్రమంత్రులు, ట్రేడ్ యూనియన్ నేతలను కలవాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.

సమ్మె ప్రారంభించి నెల రోజులు కావొస్తుండటంతో దాదాపు రెండు నెలల నుంచి జీతాలు లేవు. వేతనాలు లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read:శవాలను ఎత్తుకుపోయే పోలీసులున్నారు: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ ఎలా ఉంటుంది.. రాబోయే రోజుల్లో సమ్మె కొనసాగించాలా లేక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలా అన్న దానిపై జేఏసీ నేతలు సమావేశంలో చర్చించారు. ఉద్యోగ జేఏసీ, టీఎంయూల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి కానీ, ఇతర వర్గాల నుంచి కానీ సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఇల్లు గడవటమే కష్టంగా ఉందని ఇలాంటి పరిస్ధితుల్లో సమ్మె ఇంకా కొనసాగించాలా అన్న దానికి సంబంధించి పలువురు తమ అభిప్రాయాలు తెలిపారు.

అయితే మరో రెండు గడిస్తే ఎలా ఉంటుందనే దానిపైనా యోచిస్తున్నారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయం వెలువడిన తర్వాతే కార్మికుల భవిష్యత్ ఆధారపడే అవకాశం ఉంది. 

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మరణించారు. హన్మకొండ డిపోకు చెందిన కండక్టర్ రవీందర్‌కు మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన మూడు రోజులుగా హైదరాబాద్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Also Read:RTC Strike: హనుమకొండ ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మృతి

శనివారం మృతి చెందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంధువులను సైతం లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఆర్టీసీ కార్మికుల గుండెపోటు మరణాలు, ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. టీఎస్ ఆర్టీసీ సమ్మె శనివారానికి 29వ రోజుకు చేరుకుంది. గత నెల 5వ తేదీ నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే మరణాలు సంభవించాయి. 

కరీంనగర్ లో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ బాబు అంతిమ యాత్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అంతిమ యాత్ర సందర్భంగా బిజెపి ఎంపీ బండి సంజయ్ మీద ఏసీపీ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతిమ యాత్ర ఉద్రిక్తంగా మారింది. 

click me!