TSRTC: మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ మరో గుడ్ న్యూస్..

By Mahesh Rajamoni  |  First Published Aug 18, 2023, 11:53 PM IST

Hyderabad: మహిళా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మరో గుడ్ న్యూస్  చెప్పింది. మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 21 నుంచి కోఠి - కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును న‌డ‌ప‌నున్న‌ట్టు ఆర్టీసీ తెలిపింది. 127కే నంబర్‌తో నడిచే ఈ లేడీస్ స్పెషల్ బస్సు ఈ నెల 21 నుంచి ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంద‌ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. 
 


Telangana State Road Transport Corporation (TSRTC): మహిళా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మరో గుడ్ న్యూస్  చెప్పింది. మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 21 నుంచి కోఠి - కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును న‌డ‌ప‌నున్న‌ట్టు ఆర్టీసీ తెలిపింది. 127K నంబర్‌తో నడిచే ఈ లేడీస్ స్పెషల్ బస్సు ఈ నెల 21 నుంచి ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంద‌ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

వివ‌రాల్లోకెళ్తే.. గత కొంత కాలంగా ఆర్టీసీ బలోపేతానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న చర్యలు చేపడుతోంది. ఓ వైపు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వినూత్న ఆవిష్కరణలు చేస్తూనే సంస్థ‌పై ఆర్థిక భారం ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇదే స‌మ‌యంలో త‌న రుణ‌భారాన్ని త‌గ్గింపు చర్య‌ల‌ను సైతం అమ‌లు చేస్తోంది. అయితే, మ‌హిళా ప్ర‌యాణికుల కోసం ఇప్ప‌టికే ప‌లు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌డంతో పాటు చ‌ర్య‌లు తీసుకున్న టీఎస్ఆర్టీసీ.. మ‌హిళ‌ల‌కు మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం  లేడీస్ స్పెషల్ బస్సుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్టు తెల‌పింది. మహిళా ప్రయాణికులకు శుభవార్త చెబుతూ.. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును న‌డ‌ప‌నున్న‌ట్టు పేర్కొంది.

Latest Videos

ఈ నెల 21వ తేదీ (సోమవారం) నుంచి 127కే నంబ‌ర గ‌ల లేడీస్ స్పెషల్ బస్సును నడపనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, గుత్తల బేగంపేట, శిల్పారం, కొత్తగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా కొండాపూర్ కు వెళ్ల‌నుంది. మ‌ళ్లీ సాయంత్రం 5.45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి చేరుకుంటుందనీ, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం ద్వారా మహిళా ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. మహిళా ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని  కోరుతూ టీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ట్వీట్ చేశారు.

మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb

— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice)
click me!