
సికింద్రాబాద్ (secunderabad) కంటోన్మెంట్ ఆర్టీసీ డిపోలో (cantonment rtc depot) మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బస్‌కు (electric bus) ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనతో డిపో సిబ్బంది ప్రాణ భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గంటసేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గురైన బస్సు విలువ రూ.3 కోట్లు ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ (hyderabad) నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు (shamshabad airport) వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ 2019లో 40 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించింది. వీటిని మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోలకు కేటాయించారు అధికారులు. మియాపూర్ డిపో బస్సులు బీహెచ్‌ఈఎల్ నుంచి, కంటోన్మెంట్ డిపో బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. శబ్ధ, వాయు కాలుష్యాలకు దూరంగా సౌకర్యవంతమైన ప్రయాణం సాగించే ఈ బస్సులకు ప్రయాణీకుల నుంచి ఆదరణ బాగానే ఉంది.