పార్టీ లైన్ దాటితే వేటు తప్పదు: బండి సంజయ్ వార్నింగ్

Published : Feb 22, 2022, 05:00 PM ISTUpdated : Feb 22, 2022, 05:08 PM IST
పార్టీ లైన్ దాటితే వేటు తప్పదు: బండి సంజయ్ వార్నింగ్

సారాంశం

పార్టీ లైన్ తప్పితే ఎంతటి నాయుడిపైనా వేటు తప్పదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. మంగళవారం నాడు ఆయన బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్: ఎంతటి సీనియర్ నాయకుడైనా సరే  పార్టీ లైన్ తప్పితే వేటు తప్పదని BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.మంగళవారం నాడు బీజేపీ Karimnagar జిల్లా పదాధికారుల సమావేశంలో Bandi Sanjay పాల్గొన్నారు. కరీంనగర్, హైద్రాబాద్ జిల్లాలకు చెందిన కొందరు నేతలు రహస్యంగా సమావేశం కావడంపై బండి సంజయ్ ఈ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు.  పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి అందరూ  పనిచేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. 

 ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసంతృప్తి వాదులుంటారన్నారు. వారు పని చేయరు. పనిచేసే వారిపై అక్కసు వెళ్లగక్కుతారని బండి సంజయ్ మండిపడ్డారు.అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కోసం చిత్తశుద్దతో కృషి చేయాలని బండి సంజయ్ కోరారు.అధికారంలోకి వచ్చే సమయమిదని ఆయన చెప్పారు. తప్పుదారి పట్టించే మాటలు నమ్మి దారి తప్పితే మీ రాజకీయ భవిష్యత్తు  దెబ్బతింటుందని బండి సంజయ్ చెప్పారు.

హైదరాబాద్, Karimnagar జిల్లాలకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాములు, సుగుణాకర్ రావు, వెంకటరమణి వంటి పలువురు నేతలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో  ఇవాళ సమావేశమయ్యారు. గతంలోనే ఈ రకమైన రహస్య సమావేశాలపై బీజేపీ నాయకత్వం సీరియస్ అయ్యింది. మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి  అసమ్మతి నేతలతో చర్చించారు. భవిష్యత్తులో ఈ రకంగా అసమ్మతి సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపైనే అసమ్మతి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

గతంలో నిర్వహించిన సమావేశాలపై బీజేపీ నాయకత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. కొందరిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటారనే చర్చ కూడా సాగింది. కానీ  అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి అసమ్మతి నేతలు మరోసారి సమావేశమయ్యారు.  అయితే ఈ సమావేశంపై పార్టీ నాయకత్వం ఏ రకంగా చర్యలు తీసుకొంటుందనేది ప్రస్తుతం చర్చ సాగుతుంది. 

ఈ ఏడాది జనవరి మాసంలో అసమ్మతి నేతలు సమావేశమయ్యారు.  గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ తమను పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా స్థానిక నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్ స్థానిక కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన గుర్తింపు తమకు దక్కడం లేదని ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. 

పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అంశంపై పలువురు సీనియర్ నేతలు రహస్యంగా మీటింగ్ నిర్వహించగా, వీరందరినీ కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు అర్జున్రావు కోఆర్డినేట్ చేసినట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది.  మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ కిసాన్మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్రావు తదితరులు ఈ సమావేశంలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో తాము నిర్వహించిన భేటీ వెనుక ఆంతర్యం వేరని అసమ్మతి నేతలు పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారు. 

 ఈ నేపథ్యంలోనే వారంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా  కలిసినట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఈ అంశాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో వారిపై వేటు తప్పదని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే మరోసారి అదే తరహాలో సమావేశం కావడంతో పార్టీ నాయకత్వం ఏ రకమైన చర్యలు తీసుకొంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu