Telangana ఆర్టీసీ అదిరిపోయే వార్త..ఇక నుంచి ఆ బస్సుల్లో మగవారు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు.!

Published : Jun 10, 2025, 05:00 AM IST
ts rtc

సారాంశం

విద్యార్థుల బస్ పాస్‌తో మెట్రో ఎక్స్‌ప్రెస్ లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ బస్ పాస్ ధరలు 20 శాతం పెంచినట్లు సమాచారం.

తెలంగాణ లో (Telangana) జూన్ 12నుండి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల రవాణాకు గూడు కట్టేలా టీఎస్ ఆర్టీసీ (RTC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బస్ పాస్ ఉన్న విద్యార్థులకు కేవలం ఆర్డినరీ బస్సుల్లోనే ప్రయాణం అనుమతిస్తుండగా, తాజాగా మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ అదే పాస్‌తో ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది.

ఉచిత బస్సు…

ఈ నిర్ణయం వల్ల రోజూ ఆర్డినరీ బస్సుల కోసం వేచిచూస్తున్న విద్యార్థులకు ఊరట లభించనుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express) బస్సులు వేగంగా గమ్యస్థానాలను చేరవు చేయడం వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. ఇది విద్యార్థులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనుంది. ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న ఆర్టీసీ, ఇప్పుడు విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్య తీసుకుంది.

40 కేంద్రాల్లో విద్యార్థులు పాస్‌లను..

హైదరాబాద్ ప్రాంతంలో బస్ పాస్‌ల జారీ ప్రక్రియ జూన్ 12నుంచి ప్రారంభం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 కేంద్రాల్లో విద్యార్థులు పాస్‌లను పొందొచ్చు. ముందుగా www.tgsrtc.telangana.gov.in/bus-pass-services అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసి, అప్లికేషన్ ప్రింట్ తీసుకుని అవసరమైన డాక్యుమెంట్స్‌తో కలిసి బస్ పాస్ కౌంటర్లకు సమర్పించాల్సి ఉంటుంది.

ఈ సదుపాయంతోపాటు మరోవైపు బస్ పాస్ ధరల్లోనూ మార్పు చోటుచేసుకుంది. టీఎస్ ఆర్టీసీ ప్రకారం బస్ పాస్‌ల ధరలను సగటున 20 శాతం మేర పెంచారు. తాజా పెంపుతో ఆర్డినరీ పాస్ రూ.1150 నుండి రూ.1400కి, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ.1300 నుండి రూ.1600కి, మెట్రో డీలక్స్ పాస్ రూ.1450 నుండి రూ.1800కి పెరిగింది.

మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో…

ధరల పెంపుతో కొంతమంది విద్యార్థులపై ఆర్థిక భారం పడే అవకాశమున్నా, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణ అనుమతితో ప్రయాణం వేగవంతం కానుండటంతో దీనిని విద్యార్థుల కోసం తీసుకున్న సమతూక నిర్ణయంగా అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు కొత్త రేట్లను దృష్టిలో పెట్టుకుని తగిన ప్రణాళికతో పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !