హ్యాకింగ్ అనుమానం, రెండు నియామక పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ

By Siva Kodati  |  First Published Mar 11, 2023, 9:08 PM IST

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) రెండు నియామక పరీక్షలను వాయిదా వేసింది. హ్యాకింగ్ జరిగినట్లుగా అధికారులు అనుమానించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) రెండుత నియామక పరీక్షలను వాయిదా వేసింది. హ్యాకింగ్ ద్వారా పరీక్షా పత్రాలను తస్కరించే అనుమానం రావడంతో రేపు జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీయర్ పరీక్షతో పాటు ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది టీఎస్‌పీఎస్సీ. దీనికి సంబంధించిన ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!