టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. రంగంలోకి దిగిన ఈడీ.. ఆ కోణంలో విచారణ..!!

Published : Apr 03, 2023, 11:19 AM IST
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. రంగంలోకి దిగిన ఈడీ.. ఆ కోణంలో విచారణ..!!

సారాంశం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారిస్తున్న సంగతి  తెలిసిందే. ఇప్పుడు ఈడీ కూడా దర్యాప్తు జరపనుంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో ఈడీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు హవాలా ద్వారా జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న ఈడీ ఆ కోణంలో విచారణ చేపట్టనుంది. 

అక్రమ నగదు లావాదేవీలను గుట్టుపై ఈడీ దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టు అయినవారిని ఈడీ విచారించనున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అవసరమైతే టీఎస్పీఎస్సీ సభ్యులతో పాటు సెక్రెటరీని కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం తెలిపారు. టీఎస్పీఎస్సీ సభ్యుడు ప్రొఫెసర్ బండి లింగారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డికి బావ అని రేవంత్ ఆరోపించారు. ఈ కేసులో లింగారెడ్డి వద్ద పీఏగా చేసిన రమేష్‌ అరెస్ట్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ