త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి : అభ్యర్ధులకు టీఎస్‌పీఎస్సీ తీపికబురు

Siva Kodati |  
Published : Mar 30, 2022, 07:44 PM IST
త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి : అభ్యర్ధులకు టీఎస్‌పీఎస్సీ తీపికబురు

సారాంశం

ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి టీఎస్‌పీఎస్సీ అభ్యర్ధులకు కీలక సూచనలు చేస్తోంది. వెంటనే వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.  

త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరిస్తామని ప్రకటించింది తెలంగాణ పబ్లిక్  సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ). వెంటనే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు కొత్త జోనల్ విధానం ప్రకారం.. అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివిన వివరాలను పొందుపరచాలని చెప్పింది. చివరి వరకు ఆగి తప్పులు చేయకుండా వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించింది టీఎస్‌పీఎస్సీ.

కాగా.. ఉద్యోగాల భర్తీకి (notifications for recruitment) సంబంధించి అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ (kcr) కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  దీనికి అనుగుణంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) , శ్రీనివాస్‌గౌడ్‌ (srinivas goud) సభ్యులుగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (harish rao) నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం.. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ (somesh kumar) , ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులతో పలు దఫాలుగా చర్చించింది. దీనిలో భాగంగా తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసీఆర్ ప్రకటించిన మొత్తం 80,039 ఉద్యోగాలకు గాను తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ బుధవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఆర్ధిక శాఖ అనుమతించింది.  అలాగే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టులు, పోలీసు శాఖలో 16,587 పోస్టులు భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్‌- 42, డీఎస్పీలు-91, ఎంపీడీవో-121, వైద్యారోగ్యశాఖ పాలనాధికారులు -20, వాణిజ్య పన్నులశాఖలో 48, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ -38, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌-40 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసింది. దీనికి అనుగుణంగా టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చర్చించి మిగిలిన ఉద్యోగాలకు అనుమతి ఇవ్వనున్నారు.  

కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తక్షణమే  80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?