
కులవృత్తులు చేసుకునే వారిని భయపెట్టాలని చూస్తే.. ఏ పార్టీ వారైనా వదిలేదని లేదని హెచ్చరించారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud). హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో గీత కార్మికులను ప్రోత్సహించేందుకు రూ.25 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్ పనులను (neera cafe) బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నీరా కేఫ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీరా పానీయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ప్రజలకు వివరిస్తామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
కొంతమంది కులాలను, కులవృత్తి కార్మికులను అవమానించే విధంగా అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కులవృత్తులు చేసుకునే వారి ఆత్మ గౌరవం కోసం భవనాలు కడుతున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులవృత్తులను ప్రోత్సాహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు, కొందరు వ్యక్తులు రాష్ట్రంలో కులవృత్తులు లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేశారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లాను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బోటింగ్ సౌకర్యాన్ని స్థానిక ఎమ్మెల్యే Ala Venkateshwar Reddy తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. ప్రకృతి సిద్ధంగా కొండల నడుమ ఆహ్లాదకరమైన, అద్భుతమైన వాతావరణంలో koil sagar రిజర్వాయర్ ఉందన్నారు. గతంలో ఈ రిజర్వాయర్ లో బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు .
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆవకాశం ఉన్న అన్ని చోట్ల టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కోయిల్ సాగర్ లో boating సౌకర్యంతో పాటు, హోటల్ ,రెస్టారెంట్, కాటేజస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లలో కూడా పర్యాటక అభివృద్ధికి ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు . తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రామప్ప కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని ఆయన గుర్తు చేశారు.భూదాన్ పోచంపల్లి పర్యాటక గ్రామంగా రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషే కారణమన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనా విధానంతో అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నదే తమ తపన అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. జిల్లాను ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కోయిల్ సాగర్ లో వచ్చే సంవత్సరం నాటికి పర్యాటకంగా మరికొంత అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకశాఖ కల్పిస్తున్న సౌకర్యాలను పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.