రేపటి నుంచి అందుబాటులోకి గ్రూప్ 4 హాల్ టికెట్స్ : టీఎస్‌పీఎస్సీ, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

Siva Kodati |  
Published : Jun 23, 2023, 10:11 PM ISTUpdated : Jun 23, 2023, 10:12 PM IST
రేపటి నుంచి అందుబాటులోకి గ్రూప్ 4 హాల్ టికెట్స్  : టీఎస్‌పీఎస్సీ, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

సారాంశం

రేపటి నుంచి గ్రూప్ 4 హాల్ టికెట్లు అందుబాటులో వుంటాయని తెలిపింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ . జూలై 1న రెండు సెషన్‌లలో గ్రూప్ 4 పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది.

రేపటి నుంచి గ్రూప్ 4 హాల్ టికెట్లు అందుబాటులో వుంటాయని తెలిపింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ). https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. ప్రశ్నా పత్రాల లీకేజ్ కారణంగా పలు పరీక్షలను కమీషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రద్దు చేసిన వాటికి కొత్త షెడ్యూల్స్ ప్రకటిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా జూలై 1న రెండు సెషన్‌లలో గ్రూప్ 4 పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తోంది. ఇకపోతే.. 8,180 పోస్టుల భర్తీకి గ్రూప్ 4 నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. పేపర్ లీక్ ఘటనల నేపథ్యంలో గ్రూప్ 4 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది కమీషన్. 

ఇకపోతే.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 11న నాడు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా  994 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు 61.37 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తంగా  2,33,248 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. నిరుడు జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది అంటే 79.15 శాతం మంది హాజరు అయ్యారు. కాగా, పేపర్ లీకేజీ తర్వాత రెండోసారి నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 53000 మంది దూరంగా ఉండడం గమనార్హం.

ALso Read: గ్రూపు 1 ప్రిలిమినరీ 61 శాతం హాజరు.. రద్దైన పరీక్షతో పోలిస్తే తగ్గిన 53వేలమంది..

గతంలో జరిగి, రద్దయిన ప్రిలిమినరీ పరీక్షతో పోలిస్తే ఈసారి..  పరీక్షలో ప్రశ్నలు కాస్త సులభంగానే వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు మాత్రం..ప్రశ్నలు చదివి అర్థం చేసుకుని.. సమాధానాలను గుర్తించేందుకు.. ఒక్కో ప్రశ్నకు సగటున రెండు నిమిషాల చొప్పున పట్టిందని చెప్పారు. ఈసారి ప్రశ్నాపత్రంలో..లోతైన అనలిటికల్ ప్రశ్నలు తగ్గాయి. ప్రశ్నలు ఎక్కువ శాతం రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, తెలంగాణ ప్రభుత్వ విధానాల నుంచి ఎక్కువగా వచ్చాయని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు