కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు, ఇద్దరు హీరోయిన్లతో వందలాది కాల్స్.. తెరపైకి బిగ్‌బాస్ నటి పేరు

Siva Kodati |  
Published : Jun 23, 2023, 09:04 PM IST
కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు, ఇద్దరు హీరోయిన్లతో వందలాది కాల్స్.. తెరపైకి బిగ్‌బాస్ నటి పేరు

సారాంశం

డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిపోయిన కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ (కేపీ చౌదరి) కస్టడీ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను ప్రస్తావించారు. సినీ నటి ఆషురెడ్డి, మరో ఆర్టిస్టుతో అతను వందలాది కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు చెబుతున్నారు. 

డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిపోయిన కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ (కేపీ చౌదరి) కస్టడీ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను ప్రస్తావించారు. సెలబ్రెటీలు, నేతల కుమారులకు కేపీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేపీ కాల్ లిస్ట్‌ను డీకోడ్ చేస్తుండటంతో పలువురి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. సినీ నటి ఆషురెడ్డి, మరో ఆర్టిస్టుతో అతను వందలాది కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే మరో ఇద్దరు హీరోయిన్లతోనూ కేపీ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. 

వీరిలో ఒకరు తెలుగు బిగ్‌బాస్‌లో నటించిన హీరోయినైతే, మరొకరు ఐటెం సాంగ్స్ చేసే నటిగా సమాచారం. కేపీ కాల్ లిస్ట్‌లో రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్ తదితరుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో 12 మందికి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు కేపీ ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో అతని బ్యాంక్ లావాదేవీలను సైతం పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా 11 అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 


 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ