టెన్త్ విద్యార్థులకు మెమోలు: ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు

By narsimha lode  |  First Published Jun 23, 2020, 10:54 AM IST

టెన్త్ క్లాస్ విద్యార్థులకు మూడు రోజుల్లో ఆయా పాఠశాలలకు మెమోలు చేరుతాయి. ఈ మెమోల్లో పొరపాట్లు జరిగితే వాటిని సవరించి ఎస్ఎస్‌సీ బోర్డుకు పంపాలని ప్రభుత్వం ప్రధానోపాధ్యాయులకు సూచించింది.



హైదరాబాద్: టెన్త్ క్లాస్ విద్యార్థులకు మూడు రోజుల్లో ఆయా పాఠశాలలకు మెమోలు చేరుతాయి. ఈ మెమోల్లో పొరపాట్లు జరిగితే వాటిని సవరించి ఎస్ఎస్‌సీ బోర్డుకు పంపాలని ప్రభుత్వం ప్రధానోపాధ్యాయులకు సూచించింది.

కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలను నిర్వహించలేదు. విద్యార్థులందరిని ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు మెమోలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Latest Videos

undefined

ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో  5,34,909 మంది విద్యార్థులు టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. , వారి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్, జీపీఏను కేటాయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల జీపీఏ వివరాలతో కూడిన ఫలితాలను వెబ్‌సైట్‌లో www.bse. telangana.gov.in ఉంచారు.

పదో తరగతి పరీక్షల ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా 1.4 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. సాధారణంగా పరీక్షలు నిర్వహించినప్పుడు 10/10 జీపీఏ రాష్ట్రవ్యాప్తంగా 2,500 మందికి మించి ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు.

 పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పాస్‌ మెమోలను 3 రోజుల్లో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది.

ఈ మెమోలను  ప్రధానోపాధ్యాయులు తమ సంతకం చేసి విద్యార్థులకు అందజేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెమోలతో విద్యార్థులు కాలేజీల్లో చేరొచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. 

ఇక పూర్తి స్థాయి మెమోలను మరో నెల రోజుల్లో పంపించనున్నట్లు వెల్లడించింది. పదో తరగతి విద్యార్థుల గ్రేడ్‌లు, గ్రేడ్‌ పాయింట్స్, గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌తో (జీపీఏ) కూడిన ఫలితాలను సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. .

విద్యార్థులకు అందజేసే పాస్‌ మెమోల్లోని వివరాల్లో పొరపాట్లు తలెత్తితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా తెలపాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు పొరపాట్ల వివరాలను ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పంపించి సవరించేలా చర్యలు చేపడతారని ప్రభుత్వం తెలిపింది.
 

click me!