బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. టికెట్ తీసుకుని మరీ.. (వీడియో)

By AN TeluguFirst Published Sep 16, 2021, 12:52 PM IST
Highlights

యం.జి.బి.యస్.లో కూడా సాధారణ వ్యక్తిగా కలియ తిరుగుతూ బస్టాండు ప్రాంగణంలోని పరిశుభ్రతను, ఏఏ ప్లాట్ ఫాంలలో ఏఏ రూట్ బస్సులు వెళ్తాయో తెలియజేసే సెక్టర్ వైజ్ రూట్ బోర్డును, విచారణ కేంద్రం, రిజర్వేషన్ కేంద్రాల పనితీరును పరిశీలించారు. 

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సాధారణ వ్యక్తిగా బస్సులో ప్రయాణించారు. ప్రయాణీకుల సాధకబాధలు తెలుసుకుని, యంజీబీఎస్ ను తనిఖీ చేశారు. బుధవారం ఉదయం 11.00 గం॥ల సమయంలో జీడిమెట్ల డిపోకు చెందిన 9 ఎక్స్ / 272 గండి మైసమ్మ - అఫ్టల్ గంజ్ -సి.బి.యస్ . రూట్లో వెళ్తున్న బస్సులో టి.యస్ . ఆర్టీసి యం.డి.వి.సి. సజ్జనార్, ఐ.పి.యస్ ఒక సాధారణ ప్రయాణీకుడిలా లక్షీకాపూల్ బస్టాపులో బస్సు ఎక్కి కండక్టరుకు తానెవరో చెప్పకుండా టికెట్ తీసుకొని యం.జి.బి.యస్.వరకు ప్రయాణిస్తూ తోటి ప్రయాణీకులతో మాటలు కలిపి ప్రయాణీకుల సాధక బాధలను స్వయంగా అడిగి తెలుసుకొన్నారు. 

"

ఆ తరువాత యం.జి.బి.యస్.లో కూడా సాధారణ వ్యక్తిగా కలియ తిరుగుతూ బస్టాండు ప్రాంగణంలోని పరిశుభ్రతను, ఏఏ ప్లాట్ ఫాంలలో ఏఏ రూట్ బస్సులు వెళ్తాయో తెలియజేసే సెక్టర్ వైజ్ రూట్ బోర్డును, విచారణ కేంద్రం, రిజర్వేషన్ కేంద్రాల పనితీరును పరిశీలించారు. 

అలాగే బస్టాండులోని మరుగుదొడ్ల పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. ప్లాట్ ఫాంపై నిలబడి ఉన్న బస్సు సిబ్బందితో మాట్లాడి ఆదాయ వివరాలు అడిగారు. బస్సులోని ప్రయాణీకులతో కూడా రవాణా సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. 

తదనంతరం అక్కడ చేరుకున్న ఈ.డి. (హెచ్ అండ్ కె.) , సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి, పరిసరాలను శుభ్రత, మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపర్చాలని , పార్కింగ్ స్థలంలో చాలా కాలంగా పేరుకుపోయున వాహనాలను తక్షణమే  యార్డ్ కు తరలించాలని, అలాగే ప్రకటనల ద్వారా ఆదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి పార్కు నిర్దహణ బాధ్యతను ఔట్ సోర్సింగ్ ఏజెంట్సకు అప్పగించవలసిందిగా సూచించారు. 

ఖాళీగా ఉన్న స్టాల్స్ భర్తీకై చర్యలు చేపట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అన్నారు. టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా, పండుగలు, వివాహ సమయాలలో బస్సులను అద్దె ప్రాతిపదికన ఇవ్వాలన్నారు. అలాగే రాబోవు దసరా పండుగ రద్దీకి తగిన బస్సులను నడిపి సంస్థ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పటి నుండే రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని.. అలాగే తగిన ప్రచారం కూడా చేయాలని ఆదేశించారు.

click me!