పారిపోయేందుకు యత్నించి,చివరికి ఆత్మహత్య: రాజు సూసైడ్ పై ప్రత్యక్ష సాక్షి

Published : Sep 16, 2021, 12:28 PM IST
పారిపోయేందుకు యత్నించి,చివరికి ఆత్మహత్య: రాజు సూసైడ్ పై ప్రత్యక్ష సాక్షి

సారాంశం

కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురెళ్లి  రాజు ఆత్మహత్య చేసుకొన్నాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.రైల్వే ట్రాక్ పై పనిచేసే కీ మెన్లను గుర్తించి చెట్ల పొదల్లో రాజు దాక్కొన్నాడు. అతడిని గుర్తించిన స్థానికులు వెతికడం ప్రారంభించారు. దీంతో రాజు  ఆత్మహత్య చేసుకొన్నాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్  పూర్ కు సమీపంలోని  రైల్వేట్రాక్ పై కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొని  సైదాబాద్ లో మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్నాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పారిపోయే మార్గం లేక రైలు కింద పడి రాజు ఆత్మహత్య చేసుకొని ఉంటారని ప్రత్యక్షసాక్షి కీ మెన్ కుమార్ చెప్పారు. 

also read:డెడ్‌బాడీని మాకు చూపాలి, అతను రాజో కాదో గుర్తిస్తాం: సైదాబాద్ ఘటనలో హత్యకు గురైన బాలిక తండ్రి

స్టేషన్ ఘన్‌పూర్  రైల్వే స్టేషన్  సమీపంలోని రైల్వేట్రాక్  వద్ద ఓ వ్యక్తి అమానాన్పదంగా తిరిగాడు. రైల్వేట్రాక్ పై  పనిచేసే కీ మెన్లు కుమార్, సారంగపాణిలను చూసిన రాజు చెట్ల పొదల్లోకి వెళ్లి దాక్కొన్నాడు. కీ మెన్లు ఇద్దరు తమ విధులు నిర్వహించి తిరిగి వస్తున్న సమయంలో సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న రైతులు రైల్వే ట్రాక్ పై ఓ డెడ్ బాడీ ఉన్న విషయాన్ని  కీ మెన్లకు సమాచారం ఇచ్చారు. 

ఈ విషయాన్ని స్థానికులు రైల్వే ట్రాక్ మరో వైపు స్థానికులు  రాజు కోసం వెతకడం ప్రారంభించారు. రైల్వే ట్రాక్ కీ మెన్లు  రైల్వే ట్రాక్ పై విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కోణార్క్  ఎక్స్ ప్రెస్ వస్తున్న విషయాన్ని గుర్తించిన రాజు రైలు దగ్గరకు రాగానే రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకొన్నాడని ప్రత్య క్షసాక్షి తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే