చిగురుపాటి జయరామ్ హత్యతో శిఖాచౌదరికి ఎలాంటి సంబంధం లేదు: పోలీసులు

By Arun Kumar PFirst Published Mar 14, 2019, 5:14 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం  సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ హత్య కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణ, ఈ  ముగ్గురి ప్రమేయంపై పోలీసులు మీడియాకు వివరించారు.  

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం  సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ హత్య కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణ, ఈ  ముగ్గురి ప్రమేయంపై పోలీసులు మీడియాకు వివరించారు.  

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి పోలీసులతో పాటు పలువురు రాజకీయ నాయకులతో సంబంధమున్న మాట వాస్తమేనని పోలీసులు తెలిపారు. అయితే క్రిమినల్స్ తో పోలీసులు సంబంధాలు కలిగివుండటం మంచిదికాదన్న ఉద్దేశంతో వారి పాత్రపై ముందుగా విచారణ జరిపినట్లు తెలిపారు. అలాగే రాజకీయ నాయకుల పాత్రపై విచారణ జరపగా...రాకేశ్ రెడ్డితో కొందరికి సంబంధాలు కల్గివున్నట్లు తేలిందన్నారు. కానీ ఆ హత్య కేసులో వారి ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదన్నారు. అందువల్లే అతడితో సంబంధమున్న నాయకుల పేర్లను కూడా బయటపెట్టలేకపోతున్నామని  తెలిపారు.  

మృతుడు జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై తమకు ఎలాంటి ఆధారాలు, సమాచారం లభించలేదన్నారు. కానీ జయరామ్ భార్య  మాత్రం ఆమెపైనే ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తుండటంతో మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 90 శాతం విచారణ పూర్తయ్యిందని... ఇంతవరకు శిఖాకు ఈ హత్యలో ఎలాంటి పాత్ర వున్నట్లు బయటపడలేదన్నారు. 

తాజాగా ఈ హత్యలో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. టాలీవుడ్ యాక్టర్ సూర్య, అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డిలను అరెస్ట్ చేశామన్నారు.  సూర్య, కిషోర్ లకు రాకేశ్ రెడ్డికి 6 నెలలుగా పరిచయం వున్నట్లు...వీరి ద్వారానే జయరామ్ ను మభ్యపెట్టి తన ఇంటికి రప్పించుకునేవాడని తెలిపారు. హత్య జరిగిన రోజు కూడా వీరిద్దరే జయరామ్ ను రాకేశ్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా హత్య గురించి తెలిసి కూడా పోలీసులకు సమాచారం అందిచపోవడం నేరమే కాబట్టి వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

 

click me!