TS Inter Exams 2024: ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు.
TS Inter Exams 2024: తెలంగాణలో నేటీ నుంచి (ఫిబ్రవరి 28) ఇంటర్మీడియట్ ప్రారంభంకానున్నాయి. ఒకేషనల్ అభ్యర్థులు సహా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరకానున్నారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరుగనున్న ఈ పరీక్షలకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) సర్వం సిద్ధం చేసింది.
ఈ పరీక్షలకు ఈ ఏడాది 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. వీరిలో 4,78,718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. 5,02,260 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు.
ఇందులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా..ఇక రెండవ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29 నుండి మార్చి 19 వరకు జరుగుతాయి. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు 1,521 సెంటర్లను ఏర్పాటు చేయగా.. వీటిలో 880 ప్రైవేట్ కాలేజీలు, 407 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో.. మరో 234 సెంటర్లను గురుకులాల్లో ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ పరీక్షల కోసం సుమారు 27,900 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారని , 1,521 పరీక్షా కేంద్రాల నెట్‌వర్క్‌ను CCTV అమర్చినట్టు అధికారులు తెలిపారు. ప రీక్షాకేంద్రంలోకి మొబైల్స్, వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించమని అధికారులు స్పష్టం చేశా రు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు.