HYDERABAD: తెలంగాణ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు తమ పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలపై పలువురు నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ కార్యదర్శ నారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
CPI national secretary K. Narayana: కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలపై పలువురు నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ కార్యదర్శ నారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంకా కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఆయన పొత్తులు గురించిన అంశాలను ప్రస్తావిస్తూ.. తమ పార్టీ భవిష్యత్తు పొత్తులపై క్లారిటీ ఇచ్చారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణలో ఇప్పుడు కొత్త పొత్తు ఆప్షన్ ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు. సీపీఐతో కలిసి పనిచేసే విషయంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే..చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మౌనంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రత్యామ్నాయాలు వెతకడానికి ముందు ఆయన స్పందన కోసం మరికొన్ని రోజులు వేచి చూస్తామని చెప్పారు.
గత నవంబరులో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి మద్దతు కోరుతూ బీఆర్ఎస్ వామపక్షాలను ఆశ్రయించింది. మునుగోడు నియోజకవర్గంలో గణనీయమైన క్యాడర్ బేస్ ఉన్న వామపక్షాల మద్దతు ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిందని విస్తృతంగా విశ్వసిస్తున్నారు.
మునుగోడులో వామపక్ష పార్టీల నేతలతో కలిసి రెండు బహిరంగ సభల్లో ప్రసంగించిన ఆయన బీజేపీని ఓడించేందుకు వామపక్షాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. అయితే మునుగోడు ఉపఎన్నిక తర్వాత వామపక్షాలతో కలిసి పనిచేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఎలాంటి చొరవ తీసుకోకపోవడంతో ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మిత్రపక్షాలను ఎంపిక చేసుకునేందుకు తమకు కొత్త ఆప్షన్లు ఉన్నాయని నారాయణ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడంపై బీఆర్ఎస్ నుంచి స్పందన రాకపోతే వామపక్షాలు కాంగ్రెస్ తో చేతులు కలపవచ్చనే ఊహాగానాలకు తెరలేపాయి. ఇప్పుడే రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.