TS EAMCET 2023 ప్రైమరీ కీ విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..  

Published : May 16, 2023, 01:24 AM IST
TS EAMCET 2023 ప్రైమరీ కీ విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..  

సారాంశం

TS EAMCET 2023: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( TSCHE) నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET 2023) ప్రైమరీ ఆన్సరీ కీని విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in నుండి అభ్యర్థి ప్రతిస్పందన షీట్‌తో పాటు జవాబు కీలను తనిఖీ చేయవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS EAMCET 2023: ఇటీవల తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. తాజాగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రాథమిక కీ విడుదల చేసింది. అలాగే.. TS EAMCET  అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీం ఆన్‌లైన్‌ పరీక్షల ప్రైమరీ కీని ఉన్నత విద్యామండలి మే 14న విడుదల చేసింది.

ప్రైమరీ కీతోపాటు విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లను కూడా విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inలో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికార వెబ్‌సైట్ లో తమ ఆన్సర్లను చెక్ చేసుకోవచ్చు.

TS EAMCET ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేసుకోండిలా.. 

>> అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inని సందర్శించండి.

>> 'EAMCET కీ అభ్యంతరాలు (AM)'కి వెళ్లండి

>> రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి

>> TS EAMCET జవాబు కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది

>> డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అగ్రికల్చర్‌ విభాగం అభ్యర్థులు మే 16వ తేదీలోపు.. అలాగే.. ఇంజినీరింగ్‌ విభాగం అభ్యర్థులు మే 17లోపు పంపవచ్చు. మొత్తంగా ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 94.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే..2,05,351 మందికి 1,95,275 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే..అగ్రికల్చర్‌ విభాగంలో 1,06,514 మంది పరీక్ష రాశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?