ఈ నెల 17న ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

By narsimha lode  |  First Published May 15, 2023, 6:52 PM IST

ఈ నెల  17న  బీఆర్ఎస్  శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు  జరగనున్నాయి.  


హైదరాబాద్: ఈ నెల  17న  బీఆర్ఎస్   శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు తెలంగఆణ భవన్  లో  నిర్వహించనున్నారు.   ఈ నెల  17న మధ్యాహ్నం  తెలంగాణ భవన్ లో  కేసీఆర్ అధ్యక్షతన  ఈ సమావేశం  జరగనుంది. 

కర్ణాటక రాష్ట్రంలోని  ఎన్నికల ఫలితాలతో పాటు  రానున్న రోజుల్లో  రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై  పార్టీ నేతలకు  కేసీఆర్ దిశా నిర్ధేశం  చేయనున్నారు. రాష్ట్రంలోని  రాజకీయ పరిస్థితులు  ఏ రకంగా  ముందుకు వెళ్లాలనే విషయమై    పార్టీ నేతలతో  కేసీఆర్ చర్చించనున్నారు.

Latest Videos

undefined

ఈ ఏడాది చివర్లో  తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి.  తెలంగాణలో  మూడో దఫా   అధికారంలోకి రావాలని  బీఆర్ఎస్ నాయకత్వం  వ్యూహంతో  ముందుకు వెళ్తుంది.  అయితే  ఈ  దఫా  బీఆర్ఎస్ ను  అధికారాంలోకి రాకుండా అడ్డుకోవాలని  కాంగ్రెస్, బీజేపీలు  కూడా  ప్రయత్నాలు  ప్రారంభించాయి. 

కర్ణాటక రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీని ప్రభావం  తెలంగాణపై  ఉండే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు  వ్యక్తమౌతున్నాయి.  అయితే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో  విజయం  సాధించడంతో  తెలంగాణలో   తమకు  కలిసి వచ్చే అవకాశం ఉందని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తుంది.   తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు  చేసినా కూడా   రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలు  అధికారానికి దూరంగా  ఉంది. కానీ  ఈ దఫా అధికారాన్ని దక్కింంచుకోవాలని  కాంగ్రెస్ పార్టీ  పట్టుదలతో  ఉంది.

మరో వైపు  దక్షిణాదిలో  కర్ణాటక తర్వాత  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై   బీజేపీ  కేంద్రీకరించింది.  2019 పార్లమెంట్  ఎన్నికల్లో  వచ్చిన ఫలితాలతో  పాటు  రెండు  అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు, జీహెచ్ఎంసీ  ఎన్నికల ఫలితాలు బీజేపీలో  జోష్ ను నింపాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కూడా  బీజేపీ  సీరియస్ గా తీసుకుంది. 

ఇదిలా ఉంటే  దేశంలో పార్టీని విస్తరించాలని  కేసీఆర్ తలపెట్టారు. అయితే  తెలంగాణలో  పార్టీ అధికారానికి దూరమైతే  పార్టీ విస్తరణకు  ఇబ్బందులు ఏర్పడే  అవకాశం ఉంది. దీంతో  రానున్న ఎన్నికలను బీఆర్ఎస్  ఆషామాషీగా తీసుకోవడం లేదు. 

tags
click me!